ముగిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ తరగతులు

ABN , First Publish Date - 2022-10-04T04:38:52+05:30 IST

స్థానిక ఓ ప్రైవేట్‌ పాఠశాల ప్రాంగణంలో వారం రోజుల పాటు నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి.

ముగిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ తరగతులు
ఆర్‌ఎస్‌ఎస్‌ సార్వజనికోత్సవంలో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ ప్రచారక్‌ నవీన్‌జీ

ఆత్మకూరు, అక్టోబరు 3 : స్థానిక ఓ ప్రైవేట్‌ పాఠశాల ప్రాంగణంలో వారం రోజుల పాటు నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. 120 మంది స్వయం సేవకులు శిక్షణ పొందారు. ఈ వారం రోజుల్లో శారీరక, మానసిక అంశాలు, ఉపన్యాసాల తీరుతెన్నులపై శిక్షణ ఇచ్చారు. చివరి రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ సార్వజనికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ ప్రచారక్‌ నవీన్‌జీ,  ముఖ్యఅతిథులుగా బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ కేవీ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.


 

Read more