-
-
Home » Andhra Pradesh » Nellore » mokkalanu bhatikinchali-MRGS-AndhraPradesh
-
నీటి నిల్వలు పెంచి మొక్కలను బతికించాలి
ABN , First Publish Date - 2022-07-06T03:20:42+05:30 IST
నీటి నిల్వలను పెంచి ప్రతి మొక్కను బతికించాలని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి వీ రవీంద్రన్ పేర్కొన్నారు. మండలం

గుడ్లూరు, జూలై 5 : నీటి నిల్వలను పెంచి ప్రతి మొక్కను బతికించాలని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి వీ రవీంద్రన్ పేర్కొన్నారు. మండలంలోని తెట్టు దగ్గర రైల్వే ఖాళీ ప్రదేశంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా పెంచిన మొక్కలను కేంద్ర బృందం మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రవీంద్రన్ మాట్లాడుతూ ప్రకృతి వనరులను సంరంక్షించేందుకు జలశక్తి అభియాన్ పనిచేస్తుందని అన్నారు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా ప్రకృతి పచ్చదనంగా ఉంటుందన్నారు. అనంతరం రైల్వే ప్రాంగణంలో పెంచుతున్న మామిడి, టెంకాయ, వేప మొక్కల ఎదుగుదలను పరిశీలించారు. అదే ప్రాంగణంలో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో పీడీ శీనారెడ్డి, ఏపీడీ సంజీవరావు, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఏపీవో కే వినయ్, వెలుగు ఏపీఎం అశోక్, ఈసీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.