ప్రభుత్వ రాయితీలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-09-29T04:25:09+05:30 IST

ప్రభుత్వం అందించే రాయితీలను రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ రాయితీలను వినియోగించుకోవాలి
రైతులకు ధ్రువీకరణపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి

కలిగిరి, సెప్టెంబరు 28: ప్రభుత్వం అందించే రాయితీలను రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలలోని లక్ష్మీపురం పంచాయతీలో ఎమ్మెల్యే పర్యటించారు. సచివాలయాలను తనిఖీ చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని సూచించారు. అనంతరం రైతులకు రాయితీపై మంజూరైన డ్రిప్‌, ఇరిగేషన్‌ పరికరాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్‌ కాటం రవీంద్రరెడ్డి, ములకా శ్రీనివాసులురెడ్డి, దాసరి కొండమ్మ, మల్లు రియాజ్‌ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Read more