దాతలను సకల మర్యాదలతో స్వాగతించాలి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-10-09T04:28:58+05:30 IST

ఆలయ అభివృద్ధికి చేయూతనిచ్చే దాతలను ఆలయ సకల మర్యాదలతో స్వాగతించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు.

దాతలను సకల మర్యాదలతో స్వాగతించాలి : ఎమ్మెల్యే
మాలకొండలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

వలేటివారిపాలెం, అక్టోబరు 8 : ఆలయ అభివృద్ధికి చేయూతనిచ్చే దాతలను ఆలయ సకల మర్యాదలతో స్వాగతించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జలదంకి మండలం కర్కోలపాలెంనకు చెందిన దాతలు చేబ్రోలు బాబూరావు, ఆయన ధర్మపత్ని సుజాత, కుమారులు మధుసూదన్‌, మణిదీ్‌ఫలు అన్నదానంకు ఏర్పాటు చేసిన స్టీమ్‌ బాయిలర్‌ కుక్కర్స్‌ను ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి దాతలతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం లడ్డూ నాణ్యతను, భక్తులకు పెట్టే అన్నం, కేశఖండనశాలను, క్యూలైన్లు, దర్శన టిక్కెట్లు కౌంటర్‌, ఫలహారశాలను ఆయన పరిశీలించారు. దర్శనానికి వచ్చే భక్తులను ఆలయ సిబ్బంది గౌరవంగా స్వామి అని పిలవాలన్నారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్‌ కేబీ శ్రీనివాసరావు, కందుకూరు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ దివి లింగయ్యనాయుడు, ఎస్‌ఐ సుదర్శన్‌, జడ్పీటీసీ దంపతులు  ఇంటూరి భారతి, హరిబాబు, సర్పంచులు చెన్నిబోయిన ఓబులుకొండయ్య, డేగా వెంకటేశ్వర్లు, ఇరపని సతీష్‌, వింజం వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Read more