ఎమ్మెల్యే రోడ్ల పరిశీలన!

ABN , First Publish Date - 2022-02-20T02:54:22+05:30 IST

మండలంలోని బజారువీధి, బనిగీసాహెబ్‌ పేట, అశోక్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లు, మురుగు కాలువలను ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు పరిశీలించారు.

ఎమ్మెల్యే రోడ్ల పరిశీలన!

గూడూరు, ఫిబ్రవరి 19: మండలంలోని బజారువీధి, బనిగీసాహెబ్‌ పేట, అశోక్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లు, మురుగు కాలువలను ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యం మెరుగు కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్లపై చెత్తాచెదారాలు వేయకుండా పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు సూచించామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, బొమిడి శ్రీనివాసులు, మురళి తదితరులు పాల్గొన్నారు.

Read more