ఎన్నికల కోసం కాదు..

ABN , First Publish Date - 2022-10-02T04:10:00+05:30 IST

కొవిడ్‌ కారణంగా రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా పాదయాత్రలో ప్రజలకిచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందచేస్తున్నారు తప్ప ఎన్నికల కోసం కాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

ఎన్నికల కోసం కాదు..
లబ్ధిదారులకు చేయూత చెక్కు అందజేస్తున్న మంత్రి కాకాణి, ఎమ్మెల్యే

రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

కావలి, అక్టోబరు 1: కొవిడ్‌ కారణంగా రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా పాదయాత్రలో ప్రజలకిచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందచేస్తున్నారు తప్ప ఎన్నికల కోసం కాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కావలి ఎమ్పీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన కావలి పట్టణ, మండలంలోని లబ్ధిదారులకు వైఎస్సార్‌ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని 7,195 మందికి రూ.13.48 కోట్ల చెక్కును అందచేశారు. ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సాంబశివరెడ్డి, మెప్మా పీడీ రవీంద్ర, ఆర్డీవో శీనానాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డి, ఎమ్పీడీవో సుబ్బారావు,  ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌ రెడ్డి, ఎంపీపీ కొండమ్మ, జడ్పీటీసీ జంపాని రాఘవులు వైసీపీ నేతలు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనమర్లపూడి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read more