-
-
Home » Andhra Pradesh » Nellore » mal ramireddy visit at vengalaraonagar-MRGS-AndhraPradesh
-
కావలి ఎమ్మెల్యేకు సమస్యలు ఏకరువు
ABN , First Publish Date - 2022-03-17T03:27:41+05:30 IST
ఎమ్మెల్యేలు ఉగాది నుంచి ప్రజల్లో ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డి బుధవారం నుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల వద్దకు వెళ్లారు.

కావలి, మార్చి 16: ఎమ్మెల్యేలు ఉగాది నుంచి ప్రజల్లో ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డి బుధవారం నుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల వద్దకు వెళ్లారు. పట్టణంలోని 18వ వార్డు వెంగళరావునగర్‌లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందచేస్తున్న పథకాలు వివరించేందుకు ప్రయత్నించగా మహిళలు ఒకడుగు ముందుకేసి ఖాళీ బిందెలతో ఎమ్మెల్యే వద్దకు వచ్చి అక్కడ ప్రజలు తాగునీటి ఎద్దడి, పందుల బెదద, వీధిలైట్లు వెలగటం లేదని తదితర సమస్యలు ఏకరువు పెట్టారు. వారానికో, 10 రోజులకు ఒకసారి కొళాయిల్లో మంచి నీరు వస్తుందని, ఆ నీటితో ఎలా జీవించాలని ప్రశ్నించారు. కొళాయిలలో నీరు రాదు, ట్యాంకర్ల ద్వారా సరఫరా సరిగా చేయరు, చేతి పంపులు పనిచేయవు తాము నీరెక్కడ తెచ్చుకోవాలని ప్రశ్నించారు. ట్యాంకర్ల ద్వారా కొన్ని ప్రాంతాలకు వస్తున్న నీరు ఎక్కడో గుంటల్లో తెస్తున్నారో తెలియదు గానీ ఆ నీటితో స్నానం చేస్తే శరీరమంతా అలర్జీ వచ్చి ఆసుపత్రులకు వేలకు వేలు పోయాల్సి వస్తుందని, అలర్జీ వచ్చిన ఒక బాబును ఎమ్మెల్యేకు, మున్సిపల్ అధికారులకు చూపించారు. మీ సమస్యలు తెలుసుకునేందుకే తాను ఇక్కడకు వచ్చానని ఎమ్మెల్యే చెప్పగా తాము టీవీలలో చూశాములే ముఖ్యమంత్రి ఇంటింటింకి వెళ్లమంటే మీరు ఇక్కడకు వచ్చారని ఒక మహిళ అనడంతో అంతా అవాక్కయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బీ.శివారెడ్డి, వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనమర్లపూడి నారాయణ, గ్రంధం ప్రసన్నాంజనేయులు, పండిటి కామరాజు, కనపర్తి రాజశేఖర్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.