డిమాండ్ల పరిష్కారానికి ఎల్‌ఐసీ ఏజెంట్ల ధర్నా

ABN , First Publish Date - 2022-10-01T03:50:42+05:30 IST

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఎల్‌ఐసీ ఏజెంట్లు శుక్రవారం స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లైఫ్‌ ఇన్సూ

డిమాండ్ల పరిష్కారానికి ఎల్‌ఐసీ ఏజెంట్ల ధర్నా
ధర్నాలో ఎల్‌ఐసీ ఏజెంట్లు

పొదలకూరు, సెప్టెంబరు 30: తమ డిమాండ్ల  పరిష్కారం కోసం ఎల్‌ఐసీ ఏజెంట్లు శుక్రవారం స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా -2 అధ్యక్షుడు వీ చినమాలకొండారెడ్డి  మాట్లాడుతూ పాలసీదారులకు బోనస్‌ పెంచాలని, పాలసీలపై ఇచ్చే రుణాలపై వడ్డీ తగ్గించాలని,  ప్రీమియంలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో పొదలకూరు, రాపూరు, చేజర్ల, కలువాయి, సైదాపురం మండలాలకు చెందిన ఏజెంట్లు పాల్గొన్నారు. 


Read more