లార్వా దశలోనే దోమలను నివారించాలి

ABN , First Publish Date - 2022-10-02T05:01:06+05:30 IST

లార్వా దశలోనే దోమలను నివారించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెంచలయ్య తెలిపారు. నగరంలోని నక్కలగుంట ప్రాంతంలో శనివారం ఆయన ఇంటింటికి తిరిగి లార్వా స్థితిని పరిశీలించారు.

లార్వా దశలోనే దోమలను నివారించాలి
నీటినిల్వ తొట్టెలో దోమల లార్వాను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరగాలి

 డీఎంహెచ్‌వో డాక్టర్‌ పెంచలయ్య

నెల్లూరు (వైద్యం) అక్టోబరు 1 : లార్వా దశలోనే దోమలను నివారించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెంచలయ్య తెలిపారు. నగరంలోని నక్కలగుంట ప్రాంతంలో శనివారం ఆయన ఇంటింటికి తిరిగి లార్వా స్థితిని పరిశీలించారు. అక్కడ నీరు నిల్వ ఉన్న తొట్టెలు, రోళ్లు, తదితర వాటిలో లార్వాను గుర్తించి  తొలగించారు. కాలువల్లో పేరుకున్న చెత్తా, చెదారంలో దోమల లార్వాలను గుర్తించారు. వెంటనే ఆయా కాలువల్లో దోమల నివారణ మందులను పిచికారి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య, ఆశ కార్యకర్తలు విధిగా ఇంటింటికి తిరిగి దోమల లార్వా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పాతటైర్లు, కొబ్బరి చిప్పలు, పాత డబ్బాల్లో నీటి నిల్వలేకుండా చూడాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. కార్యక్రమంలో అదనపు వైద్యాధికారి డాక్టర్‌ వెంకటప్రసాద్‌, జిల్లా మలేరియా నివారణ అధికారి హుస్సేనమ్మ, డాక్టర్‌ దయాకర్‌, డాక్టర్‌ సుధీర్‌, డాక్టర్‌ ప్రమోద్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సునీత, హెల్త్‌ సూపర్వైజర్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:01:06+05:30 IST