క్రిభ్‌కో నిర్వాసిత కుటుంబాలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-02-24T04:13:00+05:30 IST

మండలంలోని సర్వేపల్లి గ్రామం వద్ద క్రిభ్‌కో ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములిచ్చి ఉపాధి కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.7,500లు చొప్పున ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం మండల కన్వీనర్‌ ఓడూరు వెంకటకృష్ణయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎంవీ రమణ డిమాండ్‌ చేశారు.

క్రిభ్‌కో నిర్వాసిత కుటుంబాలను ఆదుకోవాలి
ఇస్కపాళెంలో ప్రచార జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

సీపీఎం నాయకుల డిమాండ్‌


వెంకటాచలం, ఫిబ్రవరి 23 : మండలంలోని సర్వేపల్లి గ్రామం వద్ద క్రిభ్‌కో ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములిచ్చి ఉపాధి కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.7,500లు చొప్పున ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం మండల కన్వీనర్‌ ఓడూరు వెంకటకృష్ణయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎంవీ రమణ డిమాండ్‌ చేశారు. బుధవారం ఇస్కపాళెం, నిడిగుంటపాళెం గ్రామాల్లో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రచార జాతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేపల్లిలో క్రిభ్‌కో ఎరువుల ఫ్యాక్టరీని వెంటనే నిర్మించాలని కోరారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ముంగర చెంచురామయ్య, అడపాల చిన్నయ్య, వెంకటశేషయ్య, అన్నం మల్లికార్జున్‌, విక్కీ రవి, ఉడత శ్రీనివాసులు, టీ వెంకయ్య, ఎస్‌కే నజీర్‌ బాషా తదితరులున్నారు. 

 


Read more