-
-
Home » Andhra Pradesh » Nellore » kovur mla prassanna curruption in patch work of penna porlukatta-MRGS-AndhraPradesh
-
పొర్లుకట్టల మరమ్మతుల్లో ప్రసన్న అవినీతి
ABN , First Publish Date - 2022-09-12T05:02:21+05:30 IST
గతేడాది పెన్నానదికి వరదలు వచ్చిన అనంతరం చేపట్టిన పొర్లుకట్టల మరమ్మతుల్లో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రూ.80కోట్ల మేర భారీ అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి
కోవూరు, సెప్టెంబరు 11 : గతేడాది పెన్నానదికి వరదలు వచ్చిన అనంతరం చేపట్టిన పొర్లుకట్టల మరమ్మతుల్లో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రూ.80కోట్ల మేర భారీ అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో వరద బీభత్సానికి ఎమ్మెల్యే ప్రసన్న ధనదాహం మాత్రమేనన్నారు. ఇసుక కోసం పెన్నా పొర్లుకట్టలను ధ్వంసం చేసి నది సహజ స్వరూపాన్ని మార్చేశారని విమర్శించారు. పొర్లుకట్టల మరమ్మతులకు మంజూరైన రూ.80కోటతో ఎక్కడా పనులు చేయలేదన్నారు. అధికారులతో ఎమ్మెల్యే కుమ్మక్కై రూ.80కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. అధికారులు అప్రమత్తంగా లేకపోతే గతేడాది మాదిరే వరదలకు గ్రామాలకు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జెట్టి రాజగోపాల్‌రెడ్డి, కొల్లారెడ్డి సుధాకర్‌రెడ్డి, ఆదాల శివారెడ్డి, వేగూరు సుబ్బానాయుడు, బాలరవి, ముసలి సుధాకర్, మందా రవికుమార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.