కూలీల సంఖ్య పెంచాలి

ABN , First Publish Date - 2022-10-01T03:54:25+05:30 IST

ఉపాధి హామి పథకం కింద పనులకు వచ్చే కూలీల సంఖ్యను క్షేత్రసహాయకులు పెంచాలని డ్వామా పీడీ పీ వెంకట్రావ్‌ తెలిపారు.

కూలీల సంఖ్య పెంచాలి
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న డ్వామా పీడీ

 మనుబోలు, సెప్టెంబరు 30: ఉపాధి హామి పథకం కింద పనులకు వచ్చే కూలీల సంఖ్యను క్షేత్రసహాయకులు పెంచాలని డ్వామా పీడీ  పీ వెంకట్రావ్‌ తెలిపారు. జాతీయరహదారిపై గూడూరు వైపు వెళ్తూ మనుబోలులో జరుగుతున్న ఫీడర్‌ చానల్‌ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక  రోజుకు అప్పగించిన పనిని పూర్తిచేస్తే రూ. 257లు కూలి వస్తుందన్నారు.   త్వరలోనే మూడువారాల కూలి డబ్బులు విడుదల అవుతాయన్నారు. సిబ్బంది సక్రమంగా పనిచేస్తే కూలీలకు మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాజమ్మ, ఎఫ్‌ఏ హరేంద్ర గౌడ్‌, టీఏ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more