పుష్కరణి ఆధునికీకరణ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-22T03:58:55+05:30 IST

బోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పుష్కరణి ఆధునికీకరణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.

పుష్కరణి ఆధునికీకరణ పనులు ప్రారంభం
గ్రానెట్‌ రాళ్లకు పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

బిట్రగుంట, సెప్టెంబరు 21: బోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పుష్కరణి ఆధునికీకరణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆలయ పాలక మండలి చైర్మన్‌ శ్రీరాం మాల్యాద్రి, ఈవో రాధాకృష్ణ ఆధ్వర్యంలో అర్చకులు వేదగిరి కళ్యాణ చార్యులు, లక్ష్మీనరసింహా చార్యులు గ్రానెట్‌ రాళ్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అధునాతన యంత్రాలతో యుద్ధప్రాతిపదికన స్వామి వారి అనుగ్రహంతో కోనేటి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయని ఈవో, చైర్మన్‌ అన్నారు. కావలి ఎమ్యెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి, ఇంజినీర్లు మంగళవారం రాత్రి గ్రానెట్‌ రాళ్ల నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలించి నిర్మాణ పనుల విషయమై చర్చించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, గ్రామస్థులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-22T03:58:55+05:30 IST