కోనలో ఆదిలక్ష్మిగా ధాన్యలక్ష్మి

ABN , First Publish Date - 2022-09-29T04:26:23+05:30 IST

మండలంలో శరన్నవరాత్రి మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాల్లో అమ్మవార్లకు స్నపన తిరు

కోనలో ఆదిలక్ష్మిగా ధాన్యలక్ష్మి
పార్వతీదేవిగా కన్యకాపరమేశ్వరీదేవి

రాపూరు, సెప్టెంబరు 28: మండలంలో శరన్నవరాత్రి మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాల్లో అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, విశేష అలంకరణ, పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోనలో ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి, రాపూరులో కన్యకాపరమేశ్వరీదేవి పార్వతీదేవి, పోతుకొండ అంకమ్మ గాయత్రీ అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాపూరు శివాలయంలో పర్వతవర్థని పార్వతీదేవికి పూజలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు. కోన విశ్వశాంతి ఆశ్రమంలో విజయేశ్వరీదేవి లలితపరమేశ్వరీదేవికి పూజలు, అభిషేకాలు, హోమాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 
Read more