కిడ్నాప్‌ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు

ABN , First Publish Date - 2022-09-14T02:56:19+05:30 IST

ఉదయగిరిలో పదేళ్ల బాలిక మసీరా కిడ్నాప్‌ వ్యవహారంపై పోలీసులు మంగళవారం ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగం

కిడ్నాప్‌ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు
బాలికను కట్టేసిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐలు

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 13: ఉదయగిరిలో పదేళ్ల బాలిక మసీరా కిడ్నాప్‌ వ్యవహారంపై పోలీసులు మంగళవారం ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సీఐ వీ.గిరిబాబు, ఎస్‌ఐ జీ.అంకమ్మలు సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించడంతోపాటు బాలిక తల్లిదండ్రులు, స్నేహితులు, జీవాల కాపర్లను విచారించారు. అలాగే బాలికలను అటవీ ప్రాంతంలో చెట్టుకు కట్టేసిన ప్రదేశాన్ని తనిఖీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాలికకు ఆత్మకూరు జిల్లా వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, కిడ్నాపర్లు ఏలాంటి ఆఘాయిత్యానికి పాల్పడలేదని వైద్యురాలు ధ్రువీకరించినట్లు సీఐ తెలిపారు. ఈ కిడ్నాప్‌ ఉదంతంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

Read more