కనుపూరులో పట్టపగలే చోరీ!

ABN , First Publish Date - 2022-11-16T00:36:48+05:30 IST

అదో పల్లెటూరు అయినా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఎవరో ఒకరు అటు ఇటుగా తిరుగుతుంటారు.

కనుపూరులో పట్టపగలే చోరీ!
తెరిచి ఉన్న బీరువా తలుపులు

వెంకటాచలం, నవంబరు 15 : అదో పల్లెటూరు అయినా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఎవరో ఒకరు అటు ఇటుగా తిరుగుతుంటారు. అందులోనూ పట్టపగలు. అలాంటి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి, రూ.25 లక్షల నగదు, 15 సవర్ల బంగారాన్ని అపహరించుకుని వెళ్లారు. వెంకటాచలం మండలం కనుపూరులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కనుపూరు గ్రామానికి చెందిన వల్లూరు చెంచురామయ్య ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఉదయం చెంచురామయ్య పని నిమిత్తం నెల్లూరుకు వెళ్లగా ఆయన భార్య సుకన్య అనారోగ్యం కారణంగా ఉదయం అసుపత్రికి వెళ్లింది. ఇది గుర్తించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వేసిన తాళాన్ని కోసి లోనికి ప్రవేశించారు. అప్పు చెల్లించేందుకు మరొకరి వద్ద అప్పుగా తెచ్చిన రూ.25 లక్షల నగదు, 19 సవర్ల బంగారం బీరువాలో ఉండగా వాటిని అపహరించుకెళ్లారు. మధ్యాహ్నం దంపతులిద్దరూ ఇంటికి తిరిగి రాగా తాళం కోసి ఉండటంతో అనుమానం వచ్చి లోనికి వెళ్లి పరిశిలించారు. బీరువాలో పెట్టి ఉన్న నగదు, బంగారం కనిపించకపోవడంతో వెంకటాచలం పోలీసులకు సమాచారం అందజేశారు. చోరీ చేసిన తర్వాత అగంతకులు వెనుక వైపు ఉన్న తలుపులు తీసుకొని వెళ్లినట్టు తెలుస్తోంది. నిత్యం ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశంలో పట్టపగలే చోరీ జరగడంతో గ్రామస్థులు అందోళన చెందుతున్నారు. కాగా తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంకటాచలం సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ అయ్యప్ప ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. భారీ చోరీ జరిగిందన్న విషయం తెలియడంతో నెల్లూరు క్రైం బ్రాంచ్‌ డీఎస్పీ శివాజీ రాజా ఇంటి వద్దకు చేరుకుని క్షుణ్ణంగా పరిశశలించారు. నిందితుల ఆధారాల కోసం క్లూస్‌ టీం రంగంలోకి దిగా సేకరిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-11-16T00:36:56+05:30 IST

Read more