-
-
Home » Andhra Pradesh » Nellore » kaluva kattala nunchi matti taralimpu-MRGS-AndhraPradesh
-
బకింగ్‌హాం కాలువ కట్టల నుంచి మట్టి తరలింపు
ABN , First Publish Date - 2022-07-06T03:09:52+05:30 IST
మండలంలోని ఇసుక, మట్టి మాఫియాకు అడ్డేలేకుండా పోయింది. తీర గ్రామమైన కొరుటూరు వద్ద బకింగ్‌హాం కెనాలు కట్టలు తె

ఇందుకూరుపేట, జూలై 5: మండలంలోని ఇసుక, మట్టి మాఫియాకు అడ్డేలేకుండా పోయింది. తీర గ్రామమైన కొరుటూరు వద్ద బకింగ్‌హాం కెనాలు కట్టలు తెగ్గొట్టి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మూడు రోజుల నుంచి రాత్రింబవళ్లు వందల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. మట్టికు విపరీతమైన డిమాండ్ ఉండడం, ధర కూడా అధికంగా ఉండడంతో బకింగ్‌హాం కాలువ కరకట్టలను ఛిద్రం చేసి తరలిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దారు పద్మజకు ఫిర్యాదు చేసినా, ఫలితం లేదని గ్రామస్థులు పేర్కొన్నారు. కాలువకు నీళ్లు వస్తే గ్రామం మునిగిపో తుందని, జిల్లా అఽధికారులు తక్షణం స్పందించి కట్టలను గ్రామాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.