కలసికట్టుగా పనిచేద్దాం : కురుగొండ్ల

ABN , First Publish Date - 2022-10-02T04:13:18+05:30 IST

అంతా కలసికట్టుగా పనిచేద్దాం... టీడీపీ జెండాను రెపరెపలాడిద్దాం.. అంటూ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చా

కలసికట్టుగా పనిచేద్దాం : కురుగొండ్ల
మాట్లాడుతున్న కురుగొండ్ల

రాపూరు, అక్టోబరు 1: అంతా కలసికట్టుగా పనిచేద్దాం... టీడీపీ జెండాను రెపరెపలాడిద్దాం.. అంటూ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక తెలుగుగంగ అతిఽథిగృహ ప్రాంగణంలో శనివారం మండల పార్టీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. గల్లీ నుంచి పట్టణం వరకు మీమీ పరిధిలోని అందరిని కలుసుకుని ప్రభుత్వ వైఫల్యాలు వివరించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనులను వివరించాలన్నారు. అనంతరం పంచాయతీ వారీగా కేడర్‌తో సమీక్షించారు ఈ కార్యక్రమంలో  ముఖ్య నాయకులు పరసా రత్నం, సీసీ నాయుడు,  దందోలు వెంకటేశ్వర్లురెడ్డి, నువ్వుల శివరామకృష్ణ, కొండ్లపూడి రాఘవరెడ్డి, షేక్‌ ముక్తియార్‌, పచ్చిగళ్ల రత్నం పాల్గొన్నారు.

--------


Read more