కలశ స్థాపనతో దసరా ఉత్సవాల ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-27T03:12:45+05:30 IST

: మండలంలోని జొన్నవాడ ఆలయంలో సోమవారం రాత్రి కలశస్థాపనతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా

కలశ స్థాపనతో దసరా ఉత్సవాల ప్రారంభం
పెన్నానదిలో యమునా పూజ చేస్తున్న వేదపండితులు, పురోహితులు

బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు 26: మండలంలోని జొన్నవాడ ఆలయంలో  సోమవారం రాత్రి కలశస్థాపనతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా  వేద పండితులు, పురోహితులు, అర్చకులు ఆలయ కమిటీ చైర్మన్‌ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యంనాయుడు, సభ్యులు, ఏసీ. ఈవో డీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, అనంతరం పెన్నానదిలో యమునా పూజ నిర్వహించారు. పుట్టమట్టితో ఆలయానికి చేరుకుని  దసరా ఉత్సవాలకు కలశస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉలవపాడుకు చెందిన చింతం సుందరరామిరెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజూ రాత్రి మహానవావరణ పూజలు జరగనున్నాయి.  కాగా మంగళవారం జొన్నవాడ కామాక్షితాయి త్రిపురాంబిక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

Read more