-
-
Home » Andhra Pradesh » Nellore » jonnawada temple-MRGS-AndhraPradesh
-
జొన్నవాడ ఆలయానికి వెండి శఠారి బహూకరణ
ABN , First Publish Date - 2022-04-25T04:27:55+05:30 IST
మండలంలోని జొన్నవాడ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయానికి ఆదివారం భక్తులు వెండి శఠారిని బహూకరించారు.

బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్ 24 : మండలంలోని జొన్నవాడ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయానికి ఆదివారం భక్తులు వెండి శఠారిని బహూకరించారు. ఒంగోలుకు చెందిన దాతలు వూటుకూరు వెంకట సత్యనారాయణ, మాధవి దంపతులు 299 గ్రాముల వెండి శఠారిని ఆలయ కార్యాలయంలో పాలకవర్గం సభ్యుడు టి.నందకుమార్‌కు అందజేశారు. ముందుగా దాతల గోత్రనామాలతో స్వామి, అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు శేషవస్ర్తాలు అందజేశారు.