ట్రావెల్‌ అండ్‌ టూరిజం కోర్సులో చేరండి

ABN , First Publish Date - 2022-09-18T05:17:25+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరాలని ఆ సంస్థ సహాయ ఆచార్యులు డాక్టర్‌ పి. శరవణ్‌, ఏఏవో యన్‌.నరేష్‌ కోరారు.

ట్రావెల్‌ అండ్‌ టూరిజం కోర్సులో చేరండి

నెల్లూరు (సాంస్కృతికం) సెప్టెంబరు 17 : కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరాలని ఆ సంస్థ సహాయ ఆచార్యులు డాక్టర్‌  పి. శరవణ్‌, ఏఏవో యన్‌.నరేష్‌ కోరారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ఐఐటీ టీఎం కళాశాలలో 2022-23 సంవత్సరానికి ఎంబీఏ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, బీబీఏ టూరిజం కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. సంవత్సర ఆదాయం రూ.2.50లక్షల లోపు కలిగిన విద్యార్థులకు ఫీజురీయింబర్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఎంబీఏకు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారికి రెండేళ్లు,  బీబీఏకు ఇంటర్మీడియట్‌ చదివినవారికి మూడేళ్ల కోర్సు అని తెలిపారు. పూర్తి వివరాలకు 87781 58261, 89788 78710లను సంప్రదించాలని కోరారు. 

Read more