ఉద్యోగాల రద్దు... కుదింపు

ABN , First Publish Date - 2022-12-13T23:36:18+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖలో రేషలైజేషన (హేతుబద్ధీకరణ)కు రాష్ట్ర ప్రభుత్వ అడుగులు వేస్తోంది.

ఉద్యోగాల రద్దు... కుదింపు
డీఎంహెచవో కార్యాలయంలో కౌన్సెలింగ్‌కు తరలివచ్చిన ఉద్యోగులు

143 జీవోతో ఉద్యోగుల్లో ఆందోళన

స్వీపర్‌, వాటర్‌మెన, వాచమన పోస్టుల రద్దు

ఆ బాధ్యతలన్నీ అటెండర్‌కే...

పీహెచసీల్లో 12 మందే సిబ్బంది

డీఎంహెచవో కార్యాలయంలో కౌన్సెలింగ్‌

సిఫార్సులకే ప్రాధాన్యం?

నెల్లూరు (వైద్యం), డిసెంబరు 13 : వైద్య ఆరోగ్య శాఖలో రేషలైజేషన (హేతుబద్ధీకరణ)కు రాష్ట్ర ప్రభుత్వ అడుగులు వేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన 143 జీవోతో కొందరు ఉద్యోగులు వైద్య విధాన పరిషత, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషనకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. స్వీపర్‌, వాటర్‌మెన, వాచమన వంటి పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం ఆ బాధ్యతలను కూడా అంటెండర్‌కే అప్పగించాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటి వరకు అటెండర్లు కార్యాలయంలో ఉద్యోగులకు అవసరమైన పనులు మాత్రమే చేసేవారు. ఇకనుంచి ఆ పనులతోపాటు కార్యాలయంలో చెత్త ఊడ్చే పని, వాచమన డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే కార్యాలయంలో ఉదయాన్నే మంచినీటిని ఏర్పాటు చేయాలి. ఇలా అదనపు పనులు అప్పగించడంతో అటెండర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే, డిప్యూటీ పారామెడికల్‌ ఆఫీసర్‌ పోస్టును కూడా రద్దు చేసి, ఆ బాధ్యతను హెల్త్‌ ఆఫీసర్లకు అప్పగించింది. ఇదిలా ఉంటే మంగళవారం డీఎంహెచవో కార్యాలయంలో అటెండర్ల బదిలీకి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లాలో 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా కౌన్సెలింగ్‌లో 27 మందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే కౌన్సెలింగ్‌లో కొందరు సీనియర్లకు అన్యాయం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే సిఫార్సు లెటర్లను పరిగణలోకి తీసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు సమాచారం.

పీహెచసీలలో ఇక 12 మందే!

ప్రభుత్వం విడుదల చేసిన జీవో 143 ప్రకారం ఇక నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 12 మంది మాత్రమే ఉద్యోగులు ఉంటారు. ప్రస్తుతం ప్రతి పీహెచసీలో వైద్యులు, సిబ్బంది కలిపి 20 నుంచి 25 మంది వరకు ఉండగా వారి సంఖ్యను ప్రభుత్వం 12కు కుదించింది. మిగిలిన వారిని బదిలీ చేసే దిశగా వైద్య ఆరోగ్యశాఖ లో సంస్కరణలు జరుగుతున్నాయి. మరోవైపు జోనల్‌, రాష్ట్ర స్థాయిలోనూ బదిలీలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వైద్యుల నియామకం, జోనల్‌ స్థాయిలో స్టాఫ్‌నర్సుల నియామకాలు జరిగాయి. మిగిలిన కేడర్లకు త్వరలో కౌన్సెలింగ్‌ జరగనుంది. ప్రస్తుతం జిల్లా స్థాయిలో నాల్గవ తరగతి ఉద్యోగుల కౌన్సెలింగ్‌ జరుగుతోంది. వైద్య సేవలు మరింతగా విస్తరింప చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సిబ్బంది కుదింపుపై విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బందిని తగ్గిస్తే వైద్య సేవలు ఎలా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉండగా పీహెచసీల్లోని వైద్యుల పని వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక డాక్టర్‌, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు మరో వైద్యుడు అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చింది. రాత్రి వేళ్లల్లో వైద్యులు ఫోనలో అందుబాటులో ఉండాలి. నర్సులు 24 గంటలు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. అయితే ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కొన్ని కేడర్లు రద్దయ్యాయి

ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో 143 జీవో ద్వారా ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తోంది. దీంతో కొన్ని కేడర్లు రద్దయ్యాయి. అటెండర్‌కే నాలుగు బాధ్యతలు అప్పగించటం జరిగింది. అలాగే పీహెచసీల్లోని పలువురు ఉద్యోగుల బదిలీలు జరుగుతాయి. ఇప్పటికే స్టాఫ్‌నర్సులకు జోనల్‌ స్థాయిలో కౌన్సిలింగ్‌ జరిగింది. రాష్ట్ర స్థాయిలో వైద్యుల నియామకాలు కూడా జరిగాయి. పీహెచసీలలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.

- డాక్టర్‌ పెంచలయ్య, డీఎంహెచవో

Updated Date - 2022-12-13T23:36:21+05:30 IST