ప్రభుత్వ భూములను పరిశీలించిన జేసీ

ABN , First Publish Date - 2022-11-30T23:34:35+05:30 IST

జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌ బుధ వారం మండలంలోని కాటేపల్లి పంచాయతీలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు.

ప్రభుత్వ భూములను పరిశీలించిన జేసీ
భూముల పత్రాలు పరిశీలిస్తున్న జేసీ కూర్మనాథ్‌

వింజమూరు, నవంబరు 30 : జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌ బుధ వారం మండలంలోని కాటేపల్లి పంచాయతీలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురు ప్రభుత్వ భూములు, వాగూ వంక, కొండ మేత పోరంబోకు భూములను ఆక్రమించుకొని సాగు చేస్తూ మూగజీవాలకు దారి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని గ్రామానికి చెందిన కుండా నారాయణ, వల్లూరు రమేష్‌లు హైకోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు ఆదేశాలతో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించానన్నారు. అలాగే గ్రామస్థుల నుంచి విన్నపాలను సేకరించామన్నారు. పంచాయతీ పరిధి లో ఉన్న సుమారు 3600 ఎకరాల్లో 2వేల ఎకరాలు అసైన్డ్‌, మరో 1200 ఎకరాలు మేత, కొండ చెరువు వాగు పోరంబోకు, ఇంకో 400 ఎకరాలు పట్టా భూములు అని తెలిపారు. ప్రస్తుతం 1277.70 ఎకరాల భూమి 144సెక్షన్‌ అమల్లో ఉందన్నారు. ఆ భూమిలో ఆక్రమించి ఉంటే స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని, మిగిలిన భూమిని అర్హులకు అసైన్మ్‌ంట్‌ కమిటీలో పేర్లను నమోదు చేసి పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండు, మూడు ఎకరాల ప్రభుత్వ పట్టా భూమిని పొంది అదే ప్రాంతంలో మరికొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని కొందు జేసీ దృష్టికి తీసుకుని వచ్చారు. స్పందించిన జేసీ సమగ్ర విచారణ జరిపి అర్హులకే భూమి పంపిణీ చేస్తామని, అనర్హుల నుంచి భూమిని స్వాధీనచేసుకుంటామని తెలిపారు. గ్రామంలో పాఠశాల సమీపంలో నిర్మించిన సచివాలయం ప్రారంభంపై నెలకొన్న సమస్యను బండి కృష్ణారెడ్డి, మందాడి గోవిందరెడ్డిలు జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే తహసీల్దారును సచివాయం వివరాలను అడిగి పరిష్కరించి కార్యకలాపాలను సచివా లయంలోనే కొనసాగించాలని ఆదేశించారు. అలాగే ఏక్సా లీజు పట్టా పొందిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని బండి కృష్ణారెడ్డి కోరా రు. కార్యక్రమంలో తహసీల్దారు చొప్ప రవీంద్రబాబు, ఫారెస్టు అధికారి ఆయేషా, ఆర్‌ఐ సిరాజ్‌, సర్వేయర్‌ ఖాదర్‌హుస్సేన్‌, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:34:35+05:30 IST

Read more