ముత్యాలమ్మ జాతరను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-03-19T03:57:28+05:30 IST

తూర్పుకనుపూరులో ఈ నెల 29 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరుగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్‌ వేమారెడ్డి మురళీమోహన్‌రెడ్డి కోరారు.

ముత్యాలమ్మ జాతరను విజయవంతం చేయాలి
జాతర పోస్టర్లను విడుదల చేస్తున్న మురళీమోహన్‌రెడ్డి, ఈవో తదితరులు

చిల్లకూరు, మార్చి 18: తూర్పుకనుపూరులో ఈ నెల 29 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరుగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్‌ వేమారెడ్డి మురళీమోహన్‌రెడ్డి కోరారు. శుక్రవారం  ఆలయంలో జాతరకు సంబంధించిన వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వసతులు కల్పించామన్నారు. జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈవో కోవూరు జనార్దన్‌రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more