జనసేన అధికారంలోకి వస్తే.. చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2022-10-07T05:12:51+05:30 IST

జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే రైతాంగాన్ని పురస్కార కాలంగా వేధిస్తున్న చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌ తెలిపారు.

జనసేన అధికారంలోకి వస్తే..  చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం
జగన్నాధరావుపేటలో పర్యటిస్తున్న నలిశెట్టి శ్రీధర్‌

జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌


ఆత్మకూరు, అక్టోబరు 6 : జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే రైతాంగాన్ని పురస్కార కాలంగా వేధిస్తున్న చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌ తెలిపారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా గురువారం ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని జెఆర్‌పేటలో పర్యటించి ప్రజలను సమస్యలు  సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దశాబ్దాలుగా దగాపడ్డ ఆత్మకూరు ప్రజల గొంతుకై జనసేన పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఎంతో కాలంగా ఆవేదన చెందున్న చుక్కల భూముల రైతు సమస్యను సుమోటోగా తీసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.  కార్యక్రమంలో జనసేన నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, పవన్‌, చైతన్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

Read more