జనసేన సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా

ABN , First Publish Date - 2022-06-13T03:36:39+05:30 IST

జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొన్న కార్యకర్తలకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షల వర్తిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

జనసేన సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా
కార్యకర్తలకు కిట్లు అందజేస్తున్న మనుక్రాంత్‌రెడ్డి

జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి 

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 12: జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొన్న కార్యకర్తలకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షల వర్తిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక షాదీమంజిల్‌లో జనసేనాని పవణ్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న కార్యకర్తలకు బీమా కిట్లను అందజేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం జిల్లాలో రెండోస్థానంలో నిలిచిందన్నారు. అనంతరం క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న వారికి సన్మానం నిర్వహించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీ.సుధీర్‌, జీ.కివోర్‌, ఏ.రవీంద్ర, రామచైతన్య, కృష్ణయాదవ్‌, శ్రీనివాసులు, కిరణ్‌, సురేంద్రరెడ్డి, రసూల్‌, తిరుపతయ్య, సత్యనారాయణ, మురళి, సుభానీ, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

Read more