రికార్డుల్లో పేర్లు తారుమారు చేర్చారంటూ రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-09-14T02:54:21+05:30 IST

గ్రామంలోని భూరికార్డుల్లో పేర్లు తారుమారు చేశారని ఆరోపిస్తూ తహసీల్దారు కార్యాలయం ఎదుట మంగళవారం ఎల్‌ఆర్‌ అ

రికార్డుల్లో పేర్లు తారుమారు చేర్చారంటూ రైతుల ధర్నా
డీటీ భరత్‌కు వినతిపత్రం అందజేస్తున్న బాధితులు, టీడీపీ నేతలు

జలదంకి, సప్టెంబర్‌13: గ్రామంలోని భూరికార్డుల్లో పేర్లు తారుమారు చేశారని ఆరోపిస్తూ తహసీల్దారు కార్యాలయం ఎదుట మంగళవారం ఎల్‌ఆర్‌ అగ్రహారం రైతులతో కలిసి  టీడీపీ నేతలు ధర్నా చేశారు. అనంతరం డీటీ భరత్‌కు వినతిపత్రం అందించారు.  ఈ సందర్భంగా బాధిత రైతు కొర్రపాటి రామారావు మాట్లాడుతూ  గ్రామంలో తన పేరు మీద ఉన్న 1.29 భూమిలో 21సెంట్లు తన పేరు మీద ఉంచి, మిగతా 1.08 ఎకరాల భూమిని గ్రామంలోని మరో వ్యక్తి పేరున అడంగల్‌లో నమోదు చేశారని ఆరోపించారు. తాను 30ఏళ్లకు పైబడి రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నడూ ఇలాంటి సంఘటనలు తమ గ్రామంలో చోటుచేసుకోలేదన్నారు.  ప్రస్తుత ప్రభుత్వంలో  ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వర్దినేని వేణుగోపాల్‌, గుర్రం ప్రవీణ్‌  వంటేరు జయచంద్రారెడ్డి, పూనూరు భాస్కర్‌రెడ్డి, కంచర్ల వినోద్‌నాయుడు,  రాయపాటి మోహన్‌ తదితరులు  పాల్గొన్నారు.


Read more