జలదంకిలో భారీవర్షం

ABN , First Publish Date - 2022-08-26T02:51:17+05:30 IST

మండలంలో గురువారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ఈదురుగాలుతో కూడిన భారీవర్షం కురిసింది. మధ్యాహ్నం

జలదంకిలో భారీవర్షం
జలదంకిలో కురుస్తున్న వర్షం

జలదంకి, ఆగస్టు25: మండలంలో గురువారం మధ్యాహ్నం 3గంటల సమయంలో  ఈదురుగాలుతో కూడిన భారీవర్షం కురిసింది. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఎర్రని ఎండ కాస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమై ఈదురుగాలులు వీస్తూ  భారీవర్షం కురిసింది.ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు  భయబ్రాంతులకు గురయ్యారు. వేరుశనగ రాశులు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పత్తి మొక్కలపై ఉన్న దూదంతా తడిసిపోయింది. 


 బోగోలులో వర్షం : విద్యుత్‌కు అంతరాయం


బిట్రగుంట, ఆగస్టు 25: బోగోలు మండలంలో  గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి  కారుమబ్బులు  కమ్ముకుని జోరుగా వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం భారీ కురవడంతో గంటన్నర పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందించటం లేదని స్థానికులు పేర్కొన్నారు. 
Read more