జగన్‌ అరాచక పాలనకు నిదర్శనం

ABN , First Publish Date - 2022-09-29T05:25:28+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్‌ పేరును తొలగించడం వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

జగన్‌ అరాచక పాలనకు నిదర్శనం
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

సంగం, సెప్టెంబరు 28: హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్‌ పేరును తొలగించడం వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. బుఽధవారం మండల కేంద్రమైన సంగం ఇరిగేషన్‌ బంగ్లాలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్‌, జిల్లా కార్యదర్శి బాణా శ్రీనివాసులురెడ్డిలు విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్‌ పరిపాలన తుగ్లక్‌ పాలనను గుర్తు చేస్తుందన్నారు. యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్సార్‌ పేరు పెట్టడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా జగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్పతారన్నారు. కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఉక్కాల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, షేక్‌ బాబు, కృష్ణ, రసూల్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more