రేపటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN , First Publish Date - 2022-08-02T05:22:18+05:30 IST

జిల్లాలో ఇంటర్‌ అడ్వాన్సడ్‌ సప్టిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

రేపటి నుంచి  ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఐవో వరప్రసాద్‌

నిర్వహణకు 66 కేంద్రాల ఏర్పాటు

హాజరుకానున్న 29,921 మంది విద్యార్థులు

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఆర్‌ఐవో ప్రసాద్‌రావు


నెల్లూరు (విద్య) ఆగస్టు 1: జిల్లాలో ఇంటర్‌ అడ్వాన్సడ్‌ సప్టిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సమస్యలేమైనా ఉంటే ఆర్‌ఐవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన సెంటర్‌కు ఫోన చేసి పరిష్కరించుకోవాలని ఆర్‌ఐవో టీ వరప్రసాద్‌రావు తెలిపారు. నెల్లూరులోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.


12వ తేదీ వరకు నిర్వహణ


ఈ పరీక్షలను జిల్లాలోని 66 కేంద్రాల్లో బుధవారం నుంచి ఈనెల 12వతేదీ వరకు నిర్వహిస్తామని ఆర్‌ఐవో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు ప్రఽథమ సంవత్సరం, మధ్నాహ్నం 2.30  నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు  పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రఽథమ సంవత్సరంలో జనరల్‌ 19,494 మంది, ఒకేషనల్‌ 1,024 మంది కలిపి 20,518 మంది విద్యార్ధులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్‌ 8,250 మంది, ఒకేషనల్‌ 1153 మంది కలిపి  9,403 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమంతించబోమని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలన్నారు.


 కట్టుదిట్టంగా నిర్వహణ


పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిచేందుకు హైపవర్‌కమిటీతోపాటు జిల్లా పరీక్షల కమిటీ,  ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ టీమ్‌లు,  సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించామన్నారు. ఇప్పటికే కలెక్టర్‌ అధ్యక్షతన వివిధ శాఖలతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు వైద్య సదుపాయంతోపాటు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్‌ఐవో పేర్కొన్నారు. 


మొబైల్స్‌ను అనుమతించం..


పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోనలను అనుమతించబోమని చెప్పారు.  ఫీజు చెల్లించలేదని  విద్యార్థులకు హాల్‌టిక్కెట్‌లు నిరాకరిస్తే ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణ సమాచారం పొందేందుకు, ఫిర్యాదులు చేసేందుకు ఆర్‌ఐవో కార్యాలయంలో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్‌ రూములో ఫోన్‌ 0861-2320312, 94402 11159 నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు కె.మధుబాబు, సీహెచ.శ్రీనివాసులరెడ్డి, ఎ.వెంకటేశ్వర్లు, ఎ.బాలసుబ్బారెడ్డి, హైపవర్‌ కమిటీ సభ్యులు ఎస్‌ఎ.సికిందర్‌లు పాల్గొన్నారు. 


ఓపెన స్కూల్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా...


ఓపెనస్కూల్‌ టెన్త, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 3వతేదీ నుంచి 10వతేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈవో రమేష్‌ తెలిపారు. సోమవారం  నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆయన ఓపెన స్కూల్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ టెన్త విద్యార్థులకు నగరంలో మూడు సెంటర్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో ఓపెనస్కూల్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ ఎల్‌సీ రమణారెడ్డి, చీఫ్‌లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-02T05:22:18+05:30 IST