కార్పొరేటు పాఠశాలల బస్సులు తనిఖీ చేయాలి

ABN , First Publish Date - 2022-02-24T03:39:06+05:30 IST

సూళ్లూరుపేటలోని పలు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు అనుమతి లేకుండా బస్సులు నడపడంతోపాటు, పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారని పీడీఎస్‌యూ నాయకులు ఆరోపించారు.

కార్పొరేటు పాఠశాలల బస్సులు తనిఖీ చేయాలి
ఆర్టీఓకు వివతిపత్రం అందజేస్తున్న పిడిఎస్‌యు విద్యార్థులు

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 23 : సూళ్లూరుపేటలోని పలు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు అనుమతి లేకుండా బస్సులు నడపడంతోపాటు, పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారని పీడీఎస్‌యూ నాయకులు ఆరోపించారు. ఆయా బస్సులను తనిఖీ చేసి, తక్షణం చర్యలు తీసుకోవాలంటూ  బుధవారం సూళ్లూరుపేట ఆర్టీవోకు వినతి పత్రం అందజేశారు. ఆ సంస్థ జిల్లా కార్యదర్శి లోకేష్‌, వరప్రసాద్‌, చక్రపాణి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read more