చేనేత కార్మికులకు గుర్తింపు కార్డుల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-20T04:43:42+05:30 IST

పట్టణంలోని రామమందిరం సమీప నిర్మలా నందా యోగా కేంద్రంలో సోమవారం జాతీయ చేనేత నాయకులు చేనేత కార్మికులకు చేనేత గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.

చేనేత కార్మికులకు గుర్తింపు కార్డుల పంపిణీ
పొదలకూరు :గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్న జాతీయ చేనేత నాయకులు

పొదలకూరు, సెప్టెంబరు 19 : పట్టణంలోని రామమందిరం సమీప నిర్మలా నందా యోగా కేంద్రంలో సోమవారం  జాతీయ చేనేత నాయకులు చేనేత కార్మికులకు చేనేత గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు ఈ గుర్తింపు కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కోనం బ్రహ్మయ్య, జాతీయ చేనేత ఐక్య వేదిక జాతీయ కార్యవర్గ సభ్యులు చింతగింజల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్‌ పముజుల శంకరయ్య, మండల అధ్యక్షుడు సోమ భాస్కర్‌, ఉపాధ్యక్షులు మాడ రాధాకృష్ణ, కార్యదర్శి చొప్పా వెంకటేశ్వర్లు, ఉప బత్తూరి మురళీ, చేనేత కార్మికులు, చేనేత మహిళలు, తదితరులు పాల్గొన్నారు. 

మనుబోలు : మండలంలోని గోవిందరాజపురం గ్రామంలోని 40 మంది చేనేత కార్మికులకు సోమవారం కార్వే సంస్థ గుర్తింపు కార్డులను పంపిణీ చేసింది. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకు అందించే పథకాలకు ఈ గుర్తింపు కార్డులు చాలా ఉపయోగపడతాయని కార్వే సంస్థ ప్రతినిఽధి తెలిపారు. కార్యక్రమంలో గుంజి రమేష్‌, మాడా లక్ష్మీనారాయణ, ధనుంజయ్య, హరి  పాల్గొన్నారు.

Read more