ఇల్లు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

ABN , First Publish Date - 2022-09-27T04:17:45+05:30 IST

పట్టణంలోని బుడంగుంట కాలనీలో ఓ ఇంటిని రెవెన్యూ అధికారులు కూల్చి వేయడంతో బాధిత కుటుంబం సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది.

ఇల్లు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
బుడంగుంటలో రెవెన్యూ అధికారులు కూల్చిన ఇంటి వద్ద బాధితుడు శ్రీనివాసులు

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బాధిత కుటుంబం ఆందోళన

కావలి, సెప్టెంబరు 26: పట్టణంలోని బుడంగుంట కాలనీలో ఓ ఇంటిని రెవెన్యూ అధికారులు కూల్చి వేయడంతో బాధిత కుటుంబం సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది, బాధితుల, స్థానికుల కఽథనం మేరకు... బుడంగుంటలో 1976లో వంటేరు లక్ష్మమ్మ కుటుంబానికి ప్రభుత్వం 75 సెంట్ల వ్యవసాయ భూమిని కేటాయించింది. ఆ భూమి చుట్టూ 15 ఏళ్ల కిందట ఇందిరమ్మ పథకం కింద పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడంతో అక్కడ ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. దీంతో వ్యవసాయం చేయకుండా ఖాళీగా ఉంది. ఆ భూమిలో కొంతబాగం లక్ష్మమ్మ, కుమారుడు శ్రీనివాసులు ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు రికార్డు సృష్టించి దానిలో తలారులతోపాటు కొందరికి నివేశన స్థలాల పట్టాలు ఇచ్చారు. దీంతో లక్ష్మమ్మ, ఆయన కుమారుడు శ్రీనివాసులు ఆ భూమి హక్కుపై కోర్టును ఆశ్రయించారు. అయితే గతంలో పట్టాలు పొందిన తలారులు కొందరు దీనిపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో రెవెన్యూ అధికారులు అక్కడకు వెళ్లి శ్రీనివాసులు ఇంటిని కూల్చి వేశారు. దీంతో  సోమవారం బాధిత కుటుంబ సభ్యులు తమ బంధుమిత్రులతో కలిసి వచ్చి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అయితే బాధిత కుటుంబానికి అండగా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి రెవెన్యూ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. అక్కడ గొడవలు జరుగకుండా పోలీ్‌సలు సర్దుబాటు చేశారు. 


Updated Date - 2022-09-27T04:17:45+05:30 IST