Heavy rains: నెల్లూరులో ఎడతెరపిలేని వర్షాలు.. స్తంభించిన జనజీవనం

ABN , First Publish Date - 2022-11-02T10:17:46+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

Heavy rains: నెల్లూరులో ఎడతెరపిలేని వర్షాలు.. స్తంభించిన జనజీవనం

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్నాయి. వర్షాలకు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల కారణంగా మెట్ట రైతుల్లో ఆందోళన నెలకొంది. మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు పడితే మినుము, పెసర, కంది, శెనగ, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మరోవైపు సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. గంటగంటకు అలల ఉధృతి పెరుగుతుండటంతో మత్స్యకార గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి. చేపల వేటను పూర్తిగా నిలిపివేశారు. భారీగా వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-11-02T10:19:55+05:30 IST