-
-
Home » Andhra Pradesh » Nellore » head conistable chenchaiah anthima yatra with tears-MRGS-AndhraPradesh
-
పోలీస్ లాంచనాలతో చెంచయ్య అంత్యక్రియలు
ABN , First Publish Date - 2022-09-09T04:27:41+05:30 IST
విధి నిర్వహణలో మృతి చెందిన సంగం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం కావలిలో పోలీసు లాంచనాలతో జరిగాయి.

సంగం, సెప్టెంబరు 8: విధి నిర్వహణలో మృతి చెందిన సంగం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం కావలిలో పోలీసు లాంచనాలతో జరిగాయి. సంగంలో సీఎం బందోబస్తుకు తెచ్చిన బారికేడ్లను తిరిగి నెల్లూరు చేర్చేందుకు వాహనంలో కూలీలతో లోడ్ చేయిస్తుండగాహెడ్ కానిస్టేబుల్ కుప్ప కూలిపోయి గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. అంత్యక్రియల్లో కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, బుచ్చి సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.