-
-
Home » Andhra Pradesh » Nellore » harivaraprasad di hatye-MRGS-AndhraPradesh
-
హరివరప్రసాద్ది హత్యే : ఎమ్మార్పీఎస్
ABN , First Publish Date - 2022-10-05T02:56:07+05:30 IST
ఇటీవల రాంపల్లిలో చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతిచెందిన హరివరప్రసాద్ది ప్రమాదం కాదని, హత్యేనంటూ ఎమ్మా

మర్రిపాడు, అక్టోబరు 4 : ఇటీవల రాంపల్లిలో చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతిచెందిన హరివరప్రసాద్ది ప్రమాదం కాదని, హత్యేనంటూ ఎమ్మార్సీఎస్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం మర్రిపాడులో వారు ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గతంలో పత్తి చేను వద్ద హరివరప్రసాద్కు, బోడా రఘుకు ఘర్షణ జరిగిందని తెలిపారు. ఆ కక్షను మనసులో పెట్టుకొని గత నెల 27వతేదీన హరివరప్రసాద్ను రఘు బొగ్గేరు వద్దకు తీసుకెళ్లి కరెంట్ పెట్టి చంపేశారని వారు ఆరోపించారు. ప్రసాద్ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ దీపోగు మస్తాన్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అంబేడ్కర్ మాదిగ, మహేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
------------