గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-05T02:50:10+05:30 IST

మండలంలోని ఎర్రగుంట సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీ

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
చెట్ల పొదల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

వెంకటాచలం, అక్టోబరు 4 : మండలంలోని ఎర్రగుంట సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు, చెట్ల పొదల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ అయ్యప్ప సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బా, కూల్‌డ్రింక్‌  సీసా పడి ఉన్నాయి. ఆ ప్రాంతంలో  ఇతర ఆధారాలు లభించలేదు. గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు సీఐ గంగాధర్‌ తెలిపారు. 


Read more