పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-03-17T05:25:07+05:30 IST

ఆంరఽధరాష్ట్ర సాధన కోసం అశువులు బాసిన మహనీయుడు పొట్టిశ్రీరాములు చిరస్మరణీయుడని నాయుడుపేట ఆర్డీవో సరోజిని అన్నారు.

పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
నాయుడుపేట :పొట్టిశ్రీరాములు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఆర్డీవో సరోజిని

నాయుడుపేట, మార్చి 16 : ఆంరఽధరాష్ట్ర సాధన కోసం అశువులు బాసిన మహనీయుడు  పొట్టిశ్రీరాములు  చిరస్మరణీయుడని నాయుడుపేట ఆర్డీవో సరోజిని అన్నారు. బుధవారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని పాతబస్టాండ్‌ సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకుడు పెసల జయరాజగోపాల్‌గుప్త ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అలాంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏవో స్వప్న, డీటీ బెన్ని, సిబ్బంది ఖాదర్‌బాషా, వందన, స్వర్ణలత, రమాదేవి, శిరీషా, ఆర్యవైశ్య సంఘ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోటా వెంకటేశ్వర్లు, శ్రీరాములు, కృష్ణారావు, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.  

సూళ్లూరుపేట :  స్థానిక కచ్చేరివీధిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి పూలమాల వేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌, అయితా శ్రీధర్‌, కాకి శ్రీరామమూర్తి, అలవల సురేష్‌, కామిరెడ్డి, గోగుల తిరుపాల్‌, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీలో జరిగిన పొట్టి శ్రీరాములు జయంతిలలో ప్రిన్సిపాల్‌ శంకర్‌శర్మ, మధుబాబు, ఏడుకొండలు, శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీహరికోట ల్యాండ్‌ లూజర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు బైరి పార్థసారధి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

తడ : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కొలవి రఘు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.  కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, పలువురు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Read more