-
-
Home » Andhra Pradesh » Nellore » great fighter chakali ayalamma-MRGS-AndhraPradesh
-
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ
ABN , First Publish Date - 2022-09-11T05:24:10+05:30 IST
సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని టీడీపీ రజక ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంజాం రాఘవేంద్ర అన్నారు.

టీడీపీ రజక ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర
నెల్లూరు(వైద్యం)సెప్టెంబరు 10 : సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని టీడీపీ రజక ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంజాం రాఘవేంద్ర అన్నారు. శనివారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ కార్యదర్శి గంధం అంకయ్య, జలదంకి రమేష్, ఆల్ ఇండియా ధోబీ మహాసంగ్ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి కసమూరి రమేష్, మదన్, రజక నాయకులు పాల్గొన్నారు.