మేతపోరంబోకు భూమి కబ్జాకు యత్నం

ABN , First Publish Date - 2022-01-24T03:57:34+05:30 IST

మండలంలోని జీ.చెరువుపల్లి రెవెన్యూ పరిధిలోని జీ.చెర్లోపల్లి గ్రామంలో మేతపోరంబోకు భూమి కబ్జాకు శనివారం రాత్రి యత్నించిన కొందరు అధికార పార్టీ (వైసీపీ) నాయకులు తెల్లవారే సరికి మాయమయ్యారు.

మేతపోరంబోకు భూమి కబ్జాకు యత్నం
మేతపోరంబోకు భూమిలో తొలగించిన చెట్లు

రాత్రికిరాత్రే ఎక్స్‌కవేటర్‌తో చదును

తెల్లవారే సరికి మాయం

ఉదయగిరి రూరల్‌, జనవరి 23: మండలంలోని జీ.చెరువుపల్లి రెవెన్యూ పరిధిలోని జీ.చెర్లోపల్లి గ్రామంలో మేతపోరంబోకు భూమి కబ్జాకు శనివారం రాత్రి యత్నించిన కొందరు అధికార పార్టీ (వైసీపీ) నాయకులు తెల్లవారే సరికి మాయమయ్యారు. వివరాల మేరకు.. గ్రామంలోని 261 సర్వే నెంబర్‌లో పశువుల మేతపోరంబోకుగా వినియోగించుకొంటున్న 9.86 ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జా చేసేందుకు రాత్రికిరాత్రే ఎక్స్‌కవేటర్‌తో చెట్లు తొలగించారు. గతంలో కూడా అదే నాయకులు ఆ భూమిని అక్రమించేందుకు యత్నించగా గ్రామస్థులు మూకుమ్మడిగా అడ్డుకోవడంతో పలాయనం చిత్తగ్గించారు. ఆ భూమికి మంచి ధర పలుకుతుండడంతో మళ్లీ కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. చెట్లు తొలగించి చదును చేయడాన్ని ఆదివారం గమనించిన గ్రామస్థులు రెవెన్యూ అధికారులు సమాచారం అందించేందుకు ఫోన్‌ చేయగా వారు ఎవరూ స్పందించలేదని వారు తెలిపారు. అధికారులు మౌనంగా ఉండడంతోనే ఆక్రమణదారులు పలుమార్లు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భూమి కబ్జాకు యత్నించిన వారిపై తగిన చర్యలు చేపట్టడంతోపాటు కబ్జాకు గురి కాకుండా చూడాలని ఆయా  కోరుతున్నారు.

Updated Date - 2022-01-24T03:57:34+05:30 IST