కామాక్షితాయికి బంగారు సరుడు బహూకరణ

ABN , First Publish Date - 2022-10-15T05:18:27+05:30 IST

మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి,కామాక్షితాయి ఆలయంలో శుక్రవారం కామాక్షితాయికి నెల్లూరుకు చెందిన సీహెచ్‌ సుబ్రహ్మణ్యం, కల్యాణి దంపతులు 36.446 గ్రాముల బంగారు సరుడు బహూకరించారు.

కామాక్షితాయికి బంగారు సరుడు బహూకరణ

బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు14: మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి,కామాక్షితాయి ఆలయంలో శుక్రవారం కామాక్షితాయికి నెల్లూరుకు చెందిన సీహెచ్‌ సుబ్రహ్మణ్యం, కల్యాణి దంపతులు 36.446 గ్రాముల బంగారు సరుడు బహూకరించారు. నిత్య కల్యాణం సమయంలో గంగా, కామాక్షి అమ్మవార్లకు అలంకరణ నిమిత్తం సమర్పించినట్టు ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రమణ్యంనాయుడు, ఏసీ, ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు తెలిపారు.  దాతలకు స్వామి, అమ్మవార్ల వద్ద పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు.

వైభవంగా సామూహిక కుంకుమార్చన

జొన్నవాడ ఆలయంలో కామాక్షితాయికి సాయంత్రం వైభవంగా సామూహిక కుంకుమార్చన జరిగింది. అనంతర అమ్మవారిని పల్లకిలో కొలువుదీర్చి పల్లకిసేవలతో ఆలయం చుట్టూ ఊరేగించారు. ఉదయం గంగా, కామాక్షి సమేత శ్రీ మల్లికార్జునస్వామి వారి నిత్య కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది.

Read more