ఆలయ ప్రారంభోత్సవ గోడపత్రిక విడుదల

ABN , First Publish Date - 2022-08-18T03:38:20+05:30 IST

మండలంలోని కమ్మపాలెంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ, మహాశీతలీతల్లి ఆలయ ప్రారంభోత్సవ గోడ పత్రికలను బుధవారం

ఆలయ ప్రారంభోత్సవ గోడపత్రిక విడుదల
గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న ఇందిరమ్మ, గ్రామ పెద్దలు

జలదంకి, ఆగస్టు17: మండలంలోని కమ్మపాలెంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ, మహాశీతలీతల్లి  ఆలయ ప్రారంభోత్సవ గోడ పత్రికలను  బుధవారం మాజీసర్పంచి తిప్పారెడ్డి ఇందిరమ్మ, గ్రామపెద్దలు గొట్టిపాటి కొండపనాయుడు, గొట్టిపాటి శ్రీనివాసులు, పులివర్తి సుధాకర్‌నాయుడులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 20న అంకురార్పణ, హోమాలు, 21న గ్రామోత్సవం, 22న విగ్రహప్రతిష్ఠ  జరుగుతుందన్నారు. ప్రతిష్ఠ అనంతరం పూజాకార్యక్రమాలు, అన్నదానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.


Read more