గిట్టుబాటు ధర కల్పించాలి

ABN , First Publish Date - 2022-03-06T03:34:34+05:30 IST

ధాన్యానికి గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 7న నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కౌలు రైతు సంఘం నాయకుడు జోగి శివకుమార్‌ పిలుపునిచ్చారు.

గిట్టుబాటు ధర కల్పించాలి
సమావేశంలో కౌలురైతు సంఘం నాయకులు

గూడూరు, మార్చి 5: ధాన్యానికి గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 7న నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కౌలు రైతు సంఘం నాయకుడు జోగి శివకుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో  ఆయన మాట్లాడుతూ జిల్లాలో పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో మణి, వెంకటేశ్వర్లు, బీవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Read more