గాయత్రిగా కన్యకాపరమేశ్వరి

ABN , First Publish Date - 2022-10-02T04:09:27+05:30 IST

పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం కన్యకాపరమేశ్వరి గాయత్రిగా దర్శనమిచ్చారు. ఉత్తర బలి

గాయత్రిగా కన్యకాపరమేశ్వరి
సంగం : అన్నపూర్ణాదేవిగా కామాక్షిదేవి గాయత్రిగా కన్యకాపరమేశ్వరి


ఆత్మకూరు, అక్టోబరు 1:  పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం కన్యకాపరమేశ్వరి గాయత్రిగా దర్శనమిచ్చారు. ఉత్తర బలిజవీధిలోని జ్వాలాముఖి ఆలయంలో  అమ్మవారికి అభిషేకం, శ్రీదేవిఖడ్గమాల విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. ఉభయకర్తలు, భక్తులు పాల్గొన్నారు. అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో దుర్గామల్లేశ్వరి ఆలయంలో దుర్గాదేవి ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు.

సంగం : స్థానిక కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయంలో  శనివారం కామాక్షిదేవి అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం పల్లకీసేవ నిర్వహించారు.  కార్యక్రమానికి పిట్టు చంద్రశేఖర్‌రెడ్డి, పద్మజ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. 

అనంతసాగరం : మండలంలోని కామిరెడ్డిపాడు అటవీ ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీదుర్గామలేశ్వరి ఆలయంలో శనివారం వివిధ రకాల కూరగాయలు, పత్రాలతో  అమ్మవారు శాకాంబరి రూపంలో దర్శనమిచ్చారు. 


Read more