సింహవాహనంపై దర్శనమిచ్చిన చాముండేశ్వరిదేవి

ABN , First Publish Date - 2022-06-13T03:41:27+05:30 IST

గంగపట్నం చాముండేశ్వరిదేవి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

సింహవాహనంపై దర్శనమిచ్చిన చాముండేశ్వరిదేవి
సింహ వాహనంపై చాముండేశ్వరి

ఇందుకూరుపేట, జూన్‌ 12 : గంగపట్నం చాముండేశ్వరిదేవి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి సింహ వాహనంపై ప్రతిష్ఠించి రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శరత్‌, వెంకయ్య, ఫణీంద్రనాయుడు, పెనుబల్లి రామచంద్రయ్యనాయుడు ఏర్పాట్లును పర్యవేక్షించారు. 

నేడు కల్యాణోత్సవం

సోమవారం అమ్మవారి కల్యాణోత్సవం జరగనుంది. దీనికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల విశేషంగా హాజరయ్యే ఈ ఉత్సవాలకు దాదాపు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు.

Read more