గాంధీజీకి ఘన నివాళి

ABN , First Publish Date - 2022-10-03T05:08:14+05:30 IST

మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో ఆదివారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్ర్తి జయంతులను ఘనంగా నిర్వహించారు.

గాంధీజీకి ఘన నివాళి
స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళ్లర్పిస్తున్న వీఎస్‌యూ రిజిస్ర్టార్‌

వెంకటాచలం : మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న   వీఎస్‌యూలో ఆదివారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో  గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్ర్తి జయంతులను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ పీ రామచంద్రారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ అల్లం ఉదయ్‌ శంకర్‌, అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ జీ సుజయ్‌ పాల్గొన్నారు. 

జనసేన కార్యాలయంలో..: మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం గాంధీ జయంతిని ఆ పార్టీ నియోజక వర్గ నాయకుడు బొబ్బేపల్లి సురేష్‌ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో షేక్‌ రహీమ్‌, సందీప్‌, శ్రీహరి, వంశీ తదితరులు పాల్గొన్నారు. 

రాపూరు : మండలంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటుచేసి నివాళులు అర్పించారు.   

తోటపల్లిగూడూరు : మండలంలోని తహసీల్దారు కార్యాలయంలో ఆదివారం గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దారు హమీద్‌, నరుకూరు సచివాలయంలో సర్పంచ్‌ అన్నం శారద, ఎంపీటీసీ కొణతం రఘుబాబు, బీజేపీ కార్యాలయంలో అన్నం శ్రీనివాసులు, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్దారు కార్యాలయం ఆర్‌ఐ సునీల్‌రెడ్డి, వీఆర్‌వో, సిబ్బంది, మాజీ ఎంపీటీసీ పాక వెంకయ్య, నక్క సూరిబాబు, ఓడ కిషోర్‌, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Read more