ఘనంగా గుర్రం జాషువా జయంతి

ABN , First Publish Date - 2022-09-29T04:04:56+05:30 IST

మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో బుధవారం గుర్రం జాషువా జయంతిని ఘనంగా

ఘనంగా గుర్రం జాషువా జయంతి
గుర్రం జాషువా చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ విజయానంద్‌ కుమార్‌బాబు తదితరులు

వెంకటాచలం, సెప్టెంబరు 28: మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో బుధవారం గుర్రం జాషువా  జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ విజయానంద్‌ కుమార్‌బాబు మాట్లాడుతూ జాషువా సామాజిక స్పృహతో రచనలు  చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ సీ రాజారాం, డాక్టర్‌ కే లక్ష్మీనారాయణరెడ్డి, జీ సునీల్‌కుమార్‌, వీ గోవిందు, ఎన్‌ గురవయ్య, బీ ప్రభాకర్‌రావు, ఏ ప్రవీణ్‌, ఎం జబుళపతి తదితరులు పాల్గొన్నారు. 


Read more