ఘనంగా దొరసానమ్మ గంధ మహోత్సవం

ABN , First Publish Date - 2022-10-05T02:58:08+05:30 IST

ఏఎస్‌ పేటలోని శ్రీహజరత్‌ సయ్యద్‌ ఖాజారహమతుల్లా నాయూబ్‌ రసూల్‌ సతీమణి హబీబాఖతూన్‌ (దొరసానమ్మ) అమ్మవారి

ఘనంగా దొరసానమ్మ గంధ మహోత్సవం
నాయబ్‌ రసూల్‌,దొరసానమ్మల దర్గా

ఏఎస్‌ పేట,అక్టోబరు4: ఏఎస్‌ పేటలోని శ్రీహజరత్‌ సయ్యద్‌ ఖాజారహమతుల్లా నాయూబ్‌ రసూల్‌ సతీమణి హబీబాఖతూన్‌ (దొరసానమ్మ) అమ్మవారి గంధ మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.  పలురాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. విద్యుత్‌ దీపాలతో దర్గాను అలంకరించారు. మంగళవారం సాయంత్రం  మహిళలు గంధం, ప్రత్యేక మూలికలను తీసుకెళ్లి మహల్‌లో ఏర్పాటు చేసిన రోకళ్లతో దంచారు. ఇలా తయారు చేసిన గంధానికి సుగంధ తైలాలు కలిసి అర్ధరాత్రి దొరసానమ్మ సమాఽధికి లేపనం  చేసిన తరువాత భక్తులకు పంచిపెడతారు. భక్తులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంగం సీఐ రవినాయక్‌, ఏఎస్‌ పేట ఎస్‌ఐ సుబహాని బందోబస్తు ఏర్పాటు చేశారు.


Read more