రీసర్వేతో ప్రతి 10 మీటర్లకు మార్కింగ్‌

ABN , First Publish Date - 2022-10-07T04:41:46+05:30 IST

చెన్నూరురోడ్డులో నోటీసులు తీసుకున్న వ్యాపారులు, ఇళ్ల యజమానుల కోరిక మేరకు రీసర్వేతో ప్రతి 10 మీటర్లకు మార్కింగ్‌ చేస్తున్నట్టు గురువారం చేపట్టిన రీసర్వేలో నగర పంచాయతీ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

రీసర్వేతో  ప్రతి 10 మీటర్లకు మార్కింగ్‌
చెన్నూరురోడ్డులో రోడ్డు విస్తరణకు రీసర్వే చేయిస్తున్న నగర కమిషనర్‌

 నగర పంచాయతీ కమిషనర్‌

బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 6 : చెన్నూరురోడ్డులో నోటీసులు తీసుకున్న వ్యాపారులు, ఇళ్ల యజమానుల కోరిక మేరకు రీసర్వేతో ప్రతి 10 మీటర్లకు మార్కింగ్‌ చేస్తున్నట్టు గురువారం చేపట్టిన రీసర్వేలో నగర పంచాయతీ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. చెన్నూరు రోడ్లులో సెంట్రల్‌ లైటింగ్‌ కోసం ఇటీవల చేసిన సర్వేలో ప్రతి 100మీటర్లకు చేసిన మార్కింగ్‌కు బదులు ప్రతి 10మీటర్లకే చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ స్థలం ఉన్నంత వరకు రోడ్డు విస్తరణ చేసి రెండు వైపులా డ్రైన్లు, మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మాణాలు చేపట్టనున్నట్టు కమిషనర్‌ తెలిపారు. ఈమేరకు కౌన్సిల్‌ తీర్మానం చేసినట్టు తెలిపారు. అలాగే బుచ్చిలో జొన్నవాడ రోడ్డుసెంటర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి రాజుపాళెం రోడ్డు వరకు బైపాస్‌రోడ్డులోనూ విస్తరణ చేపట్టి సీసీ రోడ్లు, రోడ్డుకిరువైపులా డ్రైన్లు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరైనట్టు తెలిపారు.

Read more