పోలంరెడ్డి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-10-07T04:39:59+05:30 IST

కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జన్మదిన వేడుకలు మండలంలో గురువారం ఘనంగా జరిగాయి.

పోలంరెడ్డి జన్మదిన వేడుకలు
పోలంరెడ్డి జన్మదిన వేడుకలు

 కోవూరు, అక్టోబరు6 : కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జన్మదిన వేడుకలు మండలంలో గురువారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కేక్‌ కట్‌ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  కోవూరు, పడుగుపాడు గ్రామాల్లో నాయకులు ఆలయాల్లో ప్రత్యేకపూజలు చేశారు. వేడుకల్లో టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి, బాల రవి, నాటకరాని వెంకట్‌, సూరిశెట్టి శ్రీనివాసులు, ఆదాల శివారెడ్డి, చామంతి పురం వెంకటేశ్వర్లుతదితరులు పాల్గొన్నారు. 

బుచ్చిరెడ్డిపాళెం : కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ఘనత పోలంరెడ్డిదేనని టీడీపీ నాయకులు కొనియాడారు. గురువారం బుచ్చిరెడ్డిపాళెంలోని టీడీపీ కార్యాలయంలో క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు బత్తల హరికృష్ణ, బండ్ల కొండయ్య ఆధ్వర్యంలో పోలంరెడ్డి జన్మదిన వేడుకలను కాటంరెడ్డి సురేష్‌రెడ్డి ఘనంగా నిర్వహించారు. ముందుగా కేకు కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేకు ఒకరికొకరు తినిపించుకుని పలువురికి పంపిణీ చేశారు.  తర్వాత స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పలువురు రోగులకు బ్రెడ్లు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సారి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా పోలంరెడ్డి కుటుంబం నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజాసేవకే అంకితమవుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి, తాళ్ల నరసింహస్వామి,  దుగ్గిశెట్టి హరనాధ్‌, పానేటి నాగరాజు, మోహన్‌, వల్లూరు శీనయ్య, మస్తాన్‌, కిషోర్‌, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 కొడవలూరు: నార్తురాజు పాలెంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గిరిజనకాలనీలో అన్నదానం చేశారు. పీఎస్‌ఆర్‌ కల్యాణమండపంలో కేక్‌ కట్‌ చేసి ఆనందం వ్యక్తంచేశారు. 

ఇందుకూరుపేట :  స్థానిక టీడీపీ కార్యాలయంలో  టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పోనేబోయిన చెంచుకిషోర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల  ప్రధాన కార్యదర్శి మునగాల రంగారావు, కొండూరు సుధాకర్‌రెడ్డి, తెలుగు యువత నాయకులు కూకటి వెంకటేశ్వర్లురెడ్డి, ఏడు రామచంద్రయ్య, బాలబొమ్మ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, డేవిస్‌పేట మాజీ సర్పంచ్‌ మెనాటి ప్రసాద్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, శ్రీహరి, పాల్గొన్నారు. 

విడవలూరు : కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జన్మదిన వేడుకలు మండలంలో ఘనంగా జరిగాయి. టీడీపీ మండల అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు, సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి సత్యవోలు సత్యంరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. రామతీర్థంలో మాజీ సర్పంచ్‌ చిమట వెంకటేశ్వర్లు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పొన్నాడి చంద్రశేఖర్‌, దంపూరులో దూది విజయరాఘవన్‌ సంబరాలు చేశారు. పార్లపల్లిలో తెలుగు యువత నాయకుడు రామిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు తాతా బాలకృష్ణ ఆధ్వర్యంలో కేకు కట్‌ చేసి పేదలకు పంచారు.

Read more